![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1099 లో....వసుధారకి రిషి ఇచ్చిన గిఫ్ట్ హార్ట్ సింబల్..అది చూస్తూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడే వసుధార దగ్గరికి మను వచ్చి ఏం నిర్ణయం తీసుకున్నారు. అసలేం చేయబోతున్నారని అడుగుతాడు. నా నిర్ణయం అందరి ముందు చెప్తాను.. కొన్ని నిర్ణయలు అందరి ముందు చెప్పాలని వసుధార అంటుంది. బోర్డు మీటింగ్ లో అందరితో పాటు మీకు కూడా తెలుస్తుందని వసుధార అంటుంది. అందరితో పాటు నాక్కూడా తెలుస్తుంది కానీ ఇప్పుడు చెప్పండని మను అంటాడు. నేనేం చావను.. రిషి సర్ ఉన్నంత వరకు నేను బాగుంటానని వసుధార ఎమోషనల్ అవుతుంది.
ఆలా ఎందుకు అంటున్నారు మేడమ్ అని మను అంటాడు. ప్లీజ్ నన్నేం అడగొద్దు.. నాకు చాలా సపోర్ట్ నిలిచినందుకు థాంక్స్ అని అని వసుధార అంటుంది. ఆ తర్వాత బోర్డు మీటింగ్ కి అందరు వస్తారు. మినిస్టర్ కూడా వస్తాడు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం కదా.. ఇప్పుడు కూడా అంతే.. నేను ఇప్పటివరకు నా నిర్ణయాన్ని రిషి సర్ తో పంచుకొని వచ్చానని అనగానే అందరు షాక్ అవుతారు. నిన్న మీతో తప్పుగా మాట్లాడానని మినిస్టర్ కి వసుధార సారి చెప్తుంది. నీ వెర్షన్ నువ్వు చెప్పావ్.. అందులో తప్పు లేదు.. ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేసావని మినిస్టర్ అడుగుతాడు. ఆ తర్వాత వసుధార తన జీవితంలో DBST కాలేజీ ఎంత గొప్పదో తన అనుభవం చెప్పుకుంటూ వస్తుంది. తనకి కాలేజీ అంటే ఎంత ఇష్టమో చెప్తూ అలాంటి కాలేజీకి ఇప్పుడు నేను దూరం అవుతున్నాని వసుధార అనగానే అందరు షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావ్ వసుధార అని ఫణీంద్ర అంటాడు. నేను కాలేజీని వదిలివేద్దామని అనుకుంటున్నానని అనగానే.. నువ్వు ఎండీవి నువ్వు వెళ్లిపోవడం ఎంటని మహేంద్ర అంటాడు. ఎండీ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతున్నానని వసుధార అనగానే.. శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఆ తర్వాత వసుధార కాలేజీకి ఎండీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా పత్రాన్ని మినిస్టర్ కి ఇస్తుంది. ఇలా చేస్తున్నావ్ ఏంటమ్మా.. అది చింపెయమని మహేంద్ర అంటాడు. ఇది నా ఇష్టంతో రాసి ఇచ్చాను.. ఇది నా హక్కు.. ఎవరు ఆపలేరు.. నాకు అర్హత లేదు.. నేను నమ్మేది ఒక్కటి.. మీరు నమ్మేది ఒకటి.. రిషి సర్ ఉన్నాడంటే ఎవరు నమ్మట్లేదని వసుధార అంటుంది. నీ నిర్ణయం మార్చుకోవాలంటే ఏం చెయ్యాలని మినిస్టర్ అంటాడు. రిషి సర్ బ్రతికి ఉన్నాడని నమ్ముతారా అని వసుధార అనగానే.. ఎక్కడ అందరు నమ్ముతారోనని.. అలా ఎలా నమ్ముతామని శైలేంద్ర అంటాడు. ఇంకొక బోర్డు మెంబర్ ఏదో బ్లాక్ మెయిల్ చేసి ఎండీగా ఉంటానంటే ఎలా అని అడుగుతాడు. వసుధార రాజీనామా పత్రం ఇచ్చి వెళ్తు.. నా వెనకాల ఎవరు రాకండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |